పుష్కర సమయంలో శుభకార్యాలు చేయరు ఎందుకు ??

item2

పుష్కర సమయంలో శుభకార్యాలు చేయరు ఎందుకు ??

గురువు సింహరాశిలో ప్రవేశించిన సమయంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. ఎందుకంటే గురుబలం ముహుర్తాల్లో ఉండదు. చాంద్రమానం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో శుభకార్యాలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. గోదావరి పుష్కరాలు జరిగిన ప్రాంతం వరకే శుభకార్యాలు నిర్వహించకూడదని మరొక వాదనకూడా ఉంది. అయితే శాస్ర్తీయంగా మాత్రం గోదావరి పుష్కరాల సమయంలో ఎక్కడా శుభకార్యాలు నిర్వహించకూడదని అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. ఈ కారణంగానే ఆయా ప్రాంతాల ప్రజలు వారి సిద్ధాంతుల సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహి స్తుంటారు.

మీదర్మ సందేహాలను మాకు askguru@bhakthishakthi.com కి Email చేయండి.